కులం పేరుతో దూషించారని మాజీ కార్పోరేటర్ ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధిపై అట్రాసిటీ కేసు
May 8 2014 6:31 PM | Updated on Mar 18 2019 9:02 PM
కాకినాడ: కులం పేరుతో దూషించారని మాజీ కార్పోరేటర్ ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ పోటీ చేశారు.
తన ఇంటిపై దాడికి పాల్పడడంతో పాటు కులం పేరుతో దూషించారంటూ మాజీ కార్పొరేటర్ కొప్పల విజయకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళితులను కించపరిచే విధంగా దూషించిన నానాజీని అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాల ఆందోళన చేపట్టారు.
Advertisement
Advertisement


