టెట్‌ మరోసారి వాయిదా | ap tet postponed to february 3rd week | Sakshi
Sakshi News home page

టెట్‌ మరోసారి వాయిదా

Jan 27 2018 11:14 AM | Updated on Jan 27 2018 7:48 PM

 ap tet postponed to february 3rd week - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలను (టెట్‌)– 2017ను ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు జరగాల్సిన ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3వ తేదీ వరకూ టెట్‌ జరగనుంది. మార్చి 12న టెట్‌ కీ విడుదల చేసి, 16న ఫలితాలను వెల్లడిస్తారు. టెట్‌ వాయిదాకు సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం సాయంత్రం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

టెట్‌కు దాదాపు 4.50లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్‌జీటీ పేపర్‌-1కు 1,80,749 మంది, పేపర్‌-2కు 2,12,795 మంది దరఖాస్తు చేసుకున్నారు. భాషా పండితులు పేపర్‌కు 53, 289 మంది అప్లై చేసుకున్నారు. టెట్‌కు సిద్ధమవ్వడానికి తగినంత వ్యవధి లేదని, సిలబస్‌ కూడా ఎక్కువ ఉందని అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమవడంతో గతంలో కూడా వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement