ఏపీ కేబినెట్‌ ముందుకు పలు కీలక ప్రతిపాదనలు

AP Cabinet Meeting Starts In The Presence Of CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి బుధవారం ఉదయం సమావేశమైంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్ బ్యాగులు ఇవ్వాలని కేబినెట్‌ భేటీలో ప్రతిపాదించనున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, నోటు పుస్తకాలు ఇవ్వనున్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ సచివాలయం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అవుతారు.

కేబినెట్‌ భేటీ- ప్రతిపాదనలు..

  • ఎర్ర చందనం కేసుల విచారణ కోసం తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వ లా డిపార్ట్‌మెంట్‌  ప్రతిపాదన.
  • సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన ర్యాలీలపై నమోదైన కేసులను రద్దు చేయాలని హోమ్ శాఖ నుంచి ప్రతిపాదన.
  • ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ముసాయిదా బిల్లుపై మంత్రివర్గం ముందుకు వచ్చిన ప్రతిపాదనల మీద చర్చ.
  • మన్సిపల్ ఎన్నికల ప్రక్రియను 27 రోజుల నుంచి 20 రోజులకు కుదించే ప్రతిపాదనపై చర్చ.
  • ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్‌పై మంత్రివర్గంలో చర్చ.
  • ప్రకాశం జిల్లా దోనకొండలో సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణంపై చర్చ.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top