
సాక్షి, అమరావతి : ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లపై స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రతా తదితర విషయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఇతర శాఖల కార్యదర్శులతో స్పీకర్ చర్చించారు. ఈ నెల 12న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ శాఖ బడ్జెట్‌ను ప్రత్యేకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.