‘చంద్రబాబు ఇంటి ముందు దీక్షకు దిగుతా’ | Anna Rambabu Tirumala Padayatra Reach At Badvel | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ఇంటి ముందు దీక్షకు దిగుతా’

Sep 11 2019 1:17 PM | Updated on Sep 11 2019 2:13 PM

Anna Rambabu Tirumala Padayatra Reach At Badvel - Sakshi

సాక్షి, వైఎస్సార్ జిల్లా: గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాదయాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది. తిరుమలకు పాదయాత్రలో భాగంగా నేడు రాంబాబు వైఎస్సార్‌ జిల్లాలోని బద్వేల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య, వైఎస్సార్‌సీపీ నాయకులు, ఆర్య వైశ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం​ ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

‘ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో చేసిన తప్పిదాలను వచ్చే శాసనసభ సమావేశాల కల్లా ఒప్పుకోకపోతే బాబు ఇంటిముందే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా’నని అన్నా రాంబాబు ప్రకటించారు. కాగా  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్ర చేస్తానన్న ఆయన ఇప్పుడు మొక్కు తీర్చుకుంటున్నారు. అందులో భాగంగానే 4వ తేదీన ప్రకాశం జిల్లాలోని కాకర్ల గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement