రాజీనామా చేస్తే ప్రజల తీర్పు అగౌరపరిచినట్లే.. | Amanchi Krishna Mohan Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఆర్థికమూలాలు పోతున్నాయనే చంద్రబాబు భయం

Jan 14 2020 12:56 PM | Updated on Jan 14 2020 9:37 PM

Amanchi Krishna Mohan Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి :  రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం​ చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జోలె పట్టుకుని మరో డ్రామాకు తెరతీశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. భోగిమంటల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోటోలు, బోస్టన్, జీఎన్ రావు కమిటీ రిపోర్టులు కాలబెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు బినామీలతో భూములు కొనుగోలు చేయించారని అన్నారు. అధికార వికేంద్రీకరణను ప్రజలంతా స్వాగతిస్తున్నారని, చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్‌లో పది సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా కేసుల కారణంగా హడావుడిగా అమరావతి వచ్చారని ఎద్దేవా చేశారు. 

మీడియాతో మాట్లాడుతూ.. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హృదయాలు గెలుచుకున్నారని అన్నారు. ‘చంద్రబాబును, టీడీపీని గత ఎన్నికలలో ప్రజలు బంగాళా ఖాతంలో కలిపేశారు. దోపిడి, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. లోకేష్‌ను సైతం ఓడించారు. ఆంధ్రరాష్ట్ర ప్రజలు 151 సీట్లతో వైఎస్‌ జగన్‌ను గెలిపించారు. మా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రజలు తీర్పును అగౌరపరిచినట్లే. సీఎం రమేష్, సుజనాచౌదరి బీజేపి కండువాతో టీడీపీ ఎజెండా ఎత్తుకున్నారు. బీజేపిలోకి పంపించిన బినామీలతో చంద్రబాబు రాజీనామా చేయించి ఎన్నికలలోకు వెళ్లాలి. ఆర్థికమూలాలు పోతున్నాయని తెగ బాధపడిపోతున్నారు. అందుకే కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు.

భవిష్యత్తులో చంద్రబాబు ఎంతమంది పోలీసులను వెంటబెట్టుకున్నా.. రాష్ట్రంలో తిరగలేని పరిస్దితిని కొనితెచ్చుకుంటున్నారు. అది స్వయంకృతాపరాధం. అమరావతిని ముంపు ప్రాంతంగా శివరామకృష్ణ కమిటీ తేల్చిచెప్పింది. చెన్నై ఐఐటీ నిపుణులు కూడా అదే చెప్పారు. కొండవీటి వాగుతో అమరావతి మునిగిపోతుందని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను కరిపెట్టారు.  సీబీఐకి అనుమతి రాగానే చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీ కాళ్లు పట్టుకున్నారు. గతంలో ప్రధాని పర్యటన సందర్భంగా టీడీపీ నల్లజెండాలతో నిరసనలు తెలిపింది. రివర్స్ టెండరింగ్అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం. పవన్ కల్యాణ్‌కు రాష్ట్రంపై సరైన అవగాహన లేదు. టీడీపీ నేతలతోనే జేఏసిలు ఏర్పాటు చేసి ఆందోళనలు చేయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement