తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు | Actions take while breach of Tirumala sanctity | Sakshi
Sakshi News home page

తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

Sep 29 2014 2:18 AM | Updated on Sep 2 2017 2:04 PM

తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

తిరుమల, తిరుపతి దేవస్థానం పరిధిలో పవిత్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

టీటీడీ ఈవోకు సీఎం ఆదేశం

సాక్షి, హైదరాబాద్: తిరుమల, తిరుపతి దేవస్థానం పరిధిలో పవిత్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక పరమైన భావనలు, కార్యక్రమాలు మాత్రమే ఉండాలని, అందుకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్‌కు స్పష్టంచేశారు. తిరుమలలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడినట్లు వార్తలు రావడంతో చంద్రబాబు ఈవోతో ఫోన్లో మాట్లాడారు. నిందితుల వివరాలు తెలుసుకున్నారు. ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement