విశాఖ వుడా డీఎఫ్వో నివాసంపై ఏసీబీ దాడులు | ACB raids on Visakha VUDA DFO House | Sakshi
Sakshi News home page

విశాఖ వుడా డీఎఫ్వో నివాసంపై ఏసీబీ దాడులు

Sep 4 2013 9:51 AM | Updated on Aug 17 2018 12:56 PM

విశాఖ నగర పాలక సంస్థలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో డీఎఫ్వో రామ్మోహన్ రావు నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం దాడులు చేశారు.

విశాఖ : విశాఖ నగర పాలక సంస్థలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో డీఎఫ్వో రామ్మోహన్ రావు నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం దాడులు చేశారు. ఆయన నివాసంతో పాటు విజయనగరం జిల్లా సాలూరులోని ఆయన బంధువుల ఇళ్లపై కూడా ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement