ఏసీబీ వలలో ఏడీఈ | acb held ade | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ఏడీఈ

Feb 24 2015 4:46 PM | Updated on Aug 17 2018 12:56 PM

విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ అధికారి పట్టుబడ్డాడు.

భీమడోలు(ప.గో): విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ అధికారి పట్టుబడ్డాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు ఏపీఈపీడీసీఎల్ కార్యలయంలో జరిగింది. మండలానికి చెందిన రైతు సీవీ.కిషోర్ బోరుబావికి విద్యుత్ కనెక్షన్ కోసం భీమడోలు ఏడీఈ డి.ఆదినారాయణను సంప్రదించారు.

 

దానికి ఏడీఈ 80 వేలు లంచం ఇవ్వాల్సిందిగా కోరారు. అంత ఇవ్వలేనన్న రైతు చివరకు 50 వేలకు బేరం కుదుర్చుకొని ఆ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. పధకం ప్రకారం మంగళవారం కార్యలయంలో ఏడీఈ ఆదినారాయణ లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement