ప్రజాస్వామ్య దేశంలో కీలకమైన ఓటుహక్కు పొం దడానికి యువత ఆసక్తి చూపడం లేదు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్య దేశంలో కీలకమైన ఓటుహక్కు పొం దడానికి యువత ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల కమిషన్ విస్తృతస్థాయి లో ప్రచారం చేసినా చైతన్యం కొంతమేరకే పరిమితమైంది. జిల్లాలో 18-19 ఏళ్ల వయసున్న యువత 1,47,216 మంది ఉండగా, కొత్తగా ఓటు కోసం 72,085 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. విద్యావంతులు కూడా ఆసక్తి చూపకపోవడం విడ్డూరం.
ఇప్పటికైనా మేల్కోండి..
జిల్లావ్యాప్తంగా 27,43,655 మంది అర్హులైన ఓటర్లున్నారని జిల్లా యం త్రాంగం ఓటర్ల తుదిజాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.జిల్లాలో ఉన్న 18-19 ఏళ్లయువతలో, దరఖాస్తు చేసుకున్న వారిలో 44,582 మం ది యువకులు, 7504 మంది యువతులను అర్హులైన ఓటర్లుగా గుర్తిం చారు.
సుమారు 75వేల మంది దరఖాస్తు చేసుకోక ఓటుహక్కుకు దూరమయ్యారు. అత్యధికంగా కరీంనగర్ నియోజకవర్గంలో 9,737 మంది, అ త్యల్పంగా వేములవాడ నియోజకవర్గంలో 4,031 మంది యువ ఓటర్లు నమోదయ్యారు. జిల్లాలో ఇంటింటి సర్వేలో భాగంగా పలు ఓట్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. జాబితాలో పేర్లు లేని ఆయా గ్రామాల ప్రజలు సర్వే లో స్థానికంగా లేకపోవడంతో దాదాపు 35వేల మంది వరకు తొలగించారని సమాచారం. అలాగే రెండు ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉన్న 44,066 మందివి తిరస్కరణకు గురయ్యాయి.
మొక్కుబడిగా ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలన..
విద్యావంతులు, యువత ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నా రు. అయితే అధికారులు దాదాపు 50,000లకు పైగా ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించకపోవడంతో అర్హులు ఓటు హక్కు కోల్పో యా రు. జిల్లావ్యాప్తంగా దాదాపు 27 వేలకు పైగా ఆన్‌లైన్ దరఖాస్తులు పరి శీలించలేదని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో అజమాయిషీ లేకపోవడంతో ఇలా జరిగినట్లు సమాచారం.
సవరణలు పోను తుది ఓటరు జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాలు, గ్రామపంచాయతీలు, తహసీల్దార్ కార్యాలయా ల్లో ప్రచురించారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నందున, ఈలోగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు కల్పిస్తారు. ఏదేమైనా 18 ఏళ్ల వయస్సు దాటిన యువత ఇప్పటికైనా మేల్కోని ఓటు హక్కును బాధ్యతగా స్వీకరించాలని అధికార యంత్రాంగం కోరుతోంది.