కార్మిక నేత హత్య కేసులో ఐదుగురి అరెస్ట్ | 5 arrested in murder case at chittoor district | Sakshi
Sakshi News home page

కార్మిక నేత హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

Aug 25 2015 9:40 AM | Updated on Sep 3 2017 8:07 AM

చిత్తూరు జిల్లాలో కార్మిక నాయకుడి హత్య కేసులో ఐదుగురు నిందితులను మదనపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

మదనపల్లి: చిత్తూరు జిల్లాలో కార్మిక నాయకుడి హత్య కేసులో ఐదుగురు నిందితులను మదనపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అనంతరవి అనే వ్యక్తి మగ్గాల వ్యాపారి నాగరాజు వద్ద గతంలో పని చేస్తూ రూ.3 లక్షలు బాకీ పడ్డాడు. బాకీ తీర్చకుండా బయటకు వచ్చి కార్మిక నేతగా ఎదిగాడు. దీంతో రవి హత్యకు నాగరాజు కుట్ర పన్నాడు. గత నెల 31న మదనపల్లి సమీపంలో రవి హత్యకు గురయ్యాడు.

కేసు నమోదు కాగా, నాగరాజు సహా నిందితులంతా పరారయ్యారు. ఈ క్రమంలో వెంకటశివారెడ్డి, నారుగట్టువారిపల్లి, జగదీశ్వర్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, నాగార్జునరెడ్డి సోమవారం సాయంత్రం కురబలకోట వీఆర్వో వద్ద లొంగిపోయారు. వీఆర్వో వారిని పోలీసులకు అప్పగించగా మంగళవారం అరెస్ట్ చూపించారు. కాగా, ప్రధాన నిందితుడు నాగరాజు ఇంకా పరారీలోనే ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement