బంగారం కాజేసే తోటికోడళ్లు అరెస్ట్ | 2 women arrested due to gold robbery | Sakshi
Sakshi News home page

బంగారం కాజేసే తోటికోడళ్లు అరెస్ట్

Jun 13 2015 12:00 PM | Updated on Sep 3 2017 3:41 AM

ప్రయాణికుల దృష్టి మరల్చి బంగారు ఆభరణాలు కాజేసే తోటికోడళ్లను స్థానిక పోలీసులు అరెస్టుచేశారు.

కాకినాడ: ప్రయాణికుల దృష్టి మరల్చి బంగారు ఆభరణాలు కాజేసే తోటికోడళ్లను తూర్పు గోదావరి జిల్లా కాకినాడ  పోలీసులు అరెస్టుచేశారు. పోలీసుల కథనం ప్రకారం... కాకినాడకి చెందిన ఇద్దరు తోటికోడళ్లు గత కొంత కాలం నుంచి బంగారం చోరీ చేస్తున్నారు. కాగా, శనివారం మహిళలను అనుమానించి, వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. వారి నుంచి రూ.14.42 లక్షల విలువైన 67 కాసుల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని అదుపులోనికి తీసుకుని, కేసు నమోదు చేశారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement