100 కేజీల బంగారం స్వాధీనం... | 100 kg gold seized at Donabanda checkpost in krishna district | Sakshi
Sakshi News home page

100 కేజీల బంగారం స్వాధీనం...

Mar 27 2014 9:06 AM | Updated on Sep 2 2017 5:15 AM

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మురం చేశారు.

ఎన్నికల  నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మురం చేశారు. అందులోభాగంగా విజయవాడ  ఇబ్రహీంపట్నం సమీపంలోని దొనబండ చెక్పోస్టు వద్ద గురువారం ఉదయం వాహనాలను సోదాలు నిర్వహించారు. ఆ క్రమంలో ఓ కారులో దాదాపు 100 కేజీలకు పైగా  బంగారాన్ని పోలీసులు గుర్తించారు. ఆ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని,సీజ్ చేశారు. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని బంగారంపై ప్రశ్నిస్తున్నారు. అయితే బంగారం పట్టుకున్న విషయాన్ని పోలీసులు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement