దూసుకెళ్లిన దివాకర్ ట్రావెల్స్.. | Diwakar travels passengers injured and blast glasses | Sakshi
Sakshi News home page

దూసుకెళ్లిన దివాకర్ ట్రావెల్స్..

Feb 5 2018 11:40 AM | Updated on Apr 7 2019 3:24 PM

Diwakar travels passengers injured and blast glasses - Sakshi

సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపటంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద సోమవారం జరిగింది.

ప్రయాణికుల ప్రాణాలు అంటే ట్రావెల్స్ యాజమాన్యానికి లెక్కేలేదా అంటూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి నిరసనగా ప్రయాణికులు దివాకర్ ట్రావెల్స్ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. డ్రైవర్ మద్యం సేవించి ట్రావెల్స్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం ప్రమాదంపై ఏ విధంగానూ స్పందించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement