
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత సాయుధ దళాలు బుధవారం ఉదయం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై మిస్సైల్ దాడులు జరిపింది. భారత్ జరిపిన ఈ మెరుపు దాడిలో దాదాపు 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించారు. 60 మంది గాయపడ్డారు.
భారత్ జరిపిన దాడిని పాకిస్తాన్ అంగీకరించింది. తమ భూభాగంలో ఆరు చోట్ల దాడులు జరిగాయని, ఎనిమిది మంది చనిపోయారని తెలిపింది. ఇక ఇండియన్ ఆర్మీ విజయవంతగా నిర్వహించిన ఈ ఆపరేషన్ సిందూర్‌ను (OperationSindoor)ప్రధాని మోదీ రాత్రంతా సమీక్షించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ కేంద్రంగా ఉన్న బహావల్పూర్ సహా పంజాబ్ ప్రావిన్స్‌లోని ఐదు ప్రదేశాలు, పీఓకేలోని నాలుగు ప్రదేశాలు ఈ దాడులు జరిగాయి. వీటిలో మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం సైతం ఉంది.
"प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"
Ready to Strike, Trained to Win.#IndianArmy pic.twitter.com/M9CA9dv1Xx— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025

రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో బుధవారం తెల్లవారు జామున ఉదయం 1:44 గంటలకు ఆపరేషన్ సింధూర్‌పై ప్రకటన చేసింది. తాము దాడులు నిర్వహించింది ఉగ్రవాద స్థావరాలేనని, పాకిస్తాన్ సైనిక స్థావరాలు కాదని స్పష్టం చేసింది.
ఈ ఆపరేషన్ ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ న్యూఢిల్లీ నుంచి నేరుగా సమీక్షించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, గూఢచార సంస్థల ఉన్నతాధికారుల నుండి నిరంతరంగా సమాచారం అందుకుంది. మంగళవారం రాత్రి నుంచే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లతో ప్రధాని పలుమార్లు మాట్లాడారు. పహల్గాం ఘటన అనంతరం ప్రభుత్వ గూఢచార సంస్థల ద్వారా పొందిన కీలక నిఘా సమాచారం ఆధారంగా పాకిస్తాన్ ఉగ్రశిబిరాలపై ఈ దాడులకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచాఉరం.
దాడుల అనంతరం భారత ప్రభుత్వం ముఖ్య అంతర్జాతీయ భాగస్వాములతో సంప్రదించింది. అమెరికా, యూకే , రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాధికారులను భారత ఉన్నతాధికారులు సంప్రదించి ఈ దాడులు గురించి పూర్తిగా వివరించారు.