పెట్స్‌ని టూర్‌కి తీసుకువెళ్లాలంటే..! | Travelling Tips: Guidelines for Travelling with Pets | Sakshi
Sakshi News home page

పెట్స్‌ని టూర్‌కి తీసుకువెళ్లాలంటే..!

May 18 2026 4:58 PM | Updated on May 18 2026 5:48 PM

Travelling Tips: Guidelines for Travelling with Pets

కుక్కలను పెంచుకునేవారికి పర్యటనలకు వెళ్లేటప్పుడు వాటిని ఎక్కడ ఉంచి వెళ్లాలో తెలియదు. తోడుగా తమతో పాటు తీసుకెళ్లాలనుకుంటారు. సాధారణంగా కారు ప్రయాణం అయితే తమతోపాటు తీసుకెళ్లే వీలుంది. కానీ, బస్సు, ట్రెయిన్, విమాన ప్రయాణాలలో పెట్స్‌ను తీసుకెళ్లడం కుదురుతుందా..?!

ఏ వాహనంలోనైనా తమ పెంపుడు జంతువును తీసుకెళ్లే వీలుందా అనే విషయాన్ని ‘ముందస్తుగా బుక్‌ చేసుకున్నా’ కన్ఫర్మ్‌ చేసుకుంటూనే ఉండాలి. బడ్జెట్‌ తప్పనిసరిగా కేటాయించుకోవాలి. కొన్ని పెట్‌ రైలు ప్రయాణం కోసం నెలల తరబడి టైమ్‌ పట్టవచ్చు. టికెట్‌ రేట్లు కూడా ప్రయాణాన్ని బట్టి ఉంటాయి. హోమ్‌ స్టే కోసం రూ.600 నుంచి 10,000 వరకు ఉంటుంది. 

సౌకర్యానికే మొదటి ప్రాధాన్యత..
సుదీర్గ రైలు ప్రయాణాలు, గంటల తరబడి కారు ప్రయాణాలు, విమానప్రయాణాలు జంతువులను గందరగోళాన్ని కలిగించవచ్చు. వాటి దినచర్య పెట్‌ యజమానికి తెలుసు కాబట్టి, దానికి తగిన విధంగా ప్లాన్‌ చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజుల ముందు నుంచే కారులో వాటిని షికారుకు తీసుకెళ్లాలి. ప్రయాణాన్ని అలవాటు చేయాలి. తేలికపాటి భోజనం పెట్టడం, తగినన్ని నీళ్లు తాగించడం చేయాలి. 

అవసరమైనవి వెంట తీసుకెళితే..
కుక్కలు విశ్రాంతి తీసుకునే పరుపులు, ఆడుకునే బొమ్మలు, వాటికి తెలిసిన వస్తువులు వెంట తీసుకెళ్లాలి. ఇవి కొత్త పరిసరాలలో వాటి రోజువారీ జీవనాన్ని మొదలుపెట్టడానికి సహాయపడతాయి. ఆహారపు అలవాట్లలో ఆకస్మిక మార్పులు ఉన్నా, తెలిసిన వస్తువుల ద్వారా కొంత అలజడిని నివారించవచ్చు. 

అనుకూలమైన ప్రదేశాలు
కొన్నినగరాలలో క్యాట్‌ కేఫ్‌లు, డాగ్‌ పార్కులు ఉంటాయి. వాటికి మీ పెట్స్‌ను తీసుకెళ్లినంత మాత్రానా అవి అనుకూలంగా ఉండకపోవచ్చు. మన దేశంలో పెంపుడు జంతువులను సహించేవారు ఎక్కువే మందే ఉన్నారు. అలాగని అన్ని హోటళ్లు కుక్కలను అనుమతించవు. కొన్ని హోటళ్లు మార్కెటింగ్‌ కోసం పెట్స్‌కు ‘అనుమతి’ని ఇస్తున్నాయి. పెట్స్‌ తమతో పాటు ఉండాలంటే ప్రైవేట్‌ విల్లాలు, ఫామ్‌ హౌజ్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. గోవా వంటి ప్లేసుల్లో రెస్టారెంట్లు, బీచ్‌లలో పెట్స్‌కు తగినంత స్వేచ్ఛ లభిస్తుంది. 

మహాబలేశ్వర్‌లోని బీచ్, కొండ ప్రాంతాల్లో చేసే ట్రెక్కింగ్, ప్రశాంతమైన వీధుల గుండా పెట్స్‌తో ప్రయాణించవచ్చు. మీతో పాటు మీ కుక్క సముద్రపు అలలతో ఆడుకోవడం, రోజంతా కొత్త అనుభవాల కోసం అన్వేషించడం, తర్వాత మీతో పాటు ముడుచుకొని విశ్రాంతి తీసుకోవడం.. పెట్‌తో చేసే ప్రయాణంలో ఇవన్నీ అందమైన జ్ఞాపకాలుగా నిలిచి΄ోతాయి. ఆందోళన అనిపించే ఎలాటి అడ్డంకి అయినా సులువుగా తొలిగిపోతుందన్న భావన మదిలో మెదులుతుంది. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement