Urban planning authorities
-
నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట!
మనం ఇంటి నుండి బయటకు అడుగుపెట్టగానే... ఆఫీసులు, ఆస్పత్రులు, పాఠశాలలు, మార్కెట్లు అన్నీ కేవలం 15 నిమిషాల నడక దూరంలోనే ఉంటే ఎలా ఉంటుంది? ఇదేదో ప్యారిస్ లేదా బార్సిలోనా లాంటి విదేశీ నగరాల్లోని అత్యాధునిక విధానం అనుకుంటున్నారా? కాదు.. పశ్చిమ దేశాలు ‘15 నిమిషాల నగరం’ (15-Minute City) అనే పదాన్ని కనిపెట్టక ముందే, మన భారతదేశంలోని పాత నగరాలు ఈ అద్భుతమైన జీవనశైలికి అసలైన చిరునామాలుగా నిలిచాయి. అయితే ఆధునికీకరణ వైపు పరుగెడుతూ, మన సొంత నమూనాను మనమే ఎలా చేజేతులా దూరం చేసుకున్నామో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.‘15 నిమిషాల నగరం’ అంటే ఏమిటి?కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సరికొత్త పట్టణ ప్రణాళికే ఈ ‘15 నిమిషాల నగరం’. పని ప్రదేశాలు, కిరాణా దుకాణాలు, ఆస్పతులు, పాఠశాలలు, రవాణా సౌకర్యాలు ఇలా రోజువారీ అవసరాలన్నీ ఇంటి నుండి కేవలం 15 నిమిషాల నడక లేదా సైకిల్ ప్రయాణంలో అందుబాటులో ఉండాలన్నదే ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం. రోజువారీ ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడానికి పారిస్, బార్సిలోనా లాంటి ప్రపంచ నగరాలు ఇప్పుడు ఇదే విధానాన్ని పాటిస్తున్నాయి.మన పాత నగరాలే దానికి జీవన ఉదాహరణలునిజానికి ఈ మోడల్ భారతదేశానికి ఏమాత్రం కొత్త కాదు. పాత ఢిల్లీ, ముంబైలోని కొన్ని ప్రాంతాలు, బెంగళూరులోని బసవనగుడి, అలాగే హైదరాబాద్, చెన్నైలోని పాత కాలపు వీధుల్లో ప్రజల నివాసాలు, వాణిజ్య సముదాయాలు కలిసిపోయి ఉండేవి. ఇళ్ల కిందే దుకాణాలు, గుడి పక్కనే బడి, కూరగాయల మార్కెట్లు, మందుల షాపులు అన్నీ కూతవేటు దూరంలోనే దొరికేవి. అప్పట్లో నగరాలను ప్రత్యేకంగా డిజైన్ చేయకపోయినా, అన్నీ దగ్గరగా ఉండటం వల్ల ప్రజలు నడిచి వెళ్లడానికే ఎక్కువ ఆసక్తి చూపేవారు.ఎక్కడ దారి తప్పాం?కాలక్రమంలో మన పట్టణీకరణ విధానం పూర్తిగా దారి తప్పింది. విశాలమైన రోడ్లు, భారీ గేటెడ్ కమ్యూనిటీలు, శివార్లలో ఐటీ కారిడార్ల నిర్మాణం కారణంగా నగరాల రూపురేఖలు విచ్ఛిన్నమయ్యాయి. ఆఫీసులు నివాస ప్రాంతాలకు దూరంగా వెళ్లిపోయాయి, నడక తగ్గిపోయింది. ఉదాహరణకు బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రాంతాల్లో ఆఫీసులు, మాల్స్ దగ్గరగానే ఉన్నట్లు అనిపించినా, సరైన దారులు లేక ఆ కొద్ది దూరం వెళ్లడానికే నిత్యం గంటల కొద్దీ ట్రాఫిక్‌లో నరకం చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.ముంబై ఇప్పటికీ ఎందుకు భిన్నం?దేశంలో అత్యంత జనసాంద్రత కలిగిన ముంబై నగరం ఈ ‘15 నిమిషాల నగరం’ విధానానికి నేటికీ చాలా దగ్గరగా ఉంటుంది. ముంబైలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు సొంత వాహనాలపై ఆధారపడకుండానే రైల్వే స్టేషన్లు, కిరాణా షాపులు, రెస్టారెంట్లు, ఆస్పత్రులకు సులభంగా చేరుకోగలరు. ముంబైలో జనసాంద్రత ఎక్కువ అని విమర్శలు ఉన్నప్పటికీ, ఆ సాంద్రతే అన్నీ అందుబాటులో ఉండేలా చేసింది. ప్లానర్లు ఇప్పుడు కృత్రిమంగా సృష్టించాలని చూస్తున్న ‘మిక్స్డ్-యూజ్’ విధానాన్ని ముంబై ఏనాడో ఒంటపట్టించుకుంది.నడవలేని ఫుట్‌పాత్‌లు.. ప్రాణసంకటమైన రోడ్లు15 నిమిషాల నగరం వినడానికి చాలా బాగున్నా, ఆచరణలో మన దేశంలో ఎదురవుతున్న అతిపెద్ద అడ్డంకి ‘ఫుట్‌పాత్‌లు’. నేటి భారతీయ నగరాలు పాదచారులకు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఫుట్‌పాత్‌లు మధ్యలోనే మాయమైపోతాయి, లేదా వాహనాల పార్కింగ్, ఆక్రమణలతో నడవడానికి వీల్లేకుండా మారిపోయాయి. ఇక రోడ్డు దాటడం పెద్దలకే ఒక సాహసం అయితే, పిల్లలు, వృద్ధుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. సైకిల్ ట్రాక్‌లు కూడా పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి. సురక్షితమైన దారులు లేకుండా ఈ అద్భుతమైన పద్ధతిని అమలు చేయడం అసాధ్యం.మళ్లీ మన పాత దారికి వెళ్లాల్సిన సమయంకరోనా తర్వాత పెరిగిన వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, విపరీతమైన ట్రాఫిక్, కాలుష్యం, ఇంధన ధరల పెరుగుదల లాంటి కారణాలతో స్థానికంగానే అన్నీ అందుబాటులో ఉండే జీవనశైలిపై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. గంటల తరబడి ప్రయాణాలు చేయలేక యువత తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ తరుణంలో భారతదేశం విదేశాల నుంచి ఈ ‘15 నిమిషాల నగరం’ ఆలోచనను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన పాత నగరాల స్ఫూర్తిని కోల్పోకుండా, ఆధునికతను జోడిస్తూ, మళ్లీ పాదచారులకు అనుకూలమైన నగరాలను నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.ఇది కూడా చదవండి: బిందెడు నీరు.. బతుకంతా కన్నీరు! -
చక్కని ప్రణాళిక, మెరుగైన నగరాలు
న్యూఢిల్లీ: చక్కని ప్రణాళికతో నిర్మితమైన నగరాలే దేశ భవితను నిర్దేశిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో అలాంటి కనీసం 75 నగరాలను నిర్మించుకున్నా ప్రపంచ వేదికపై భారత్ ఎప్పుడో గొప్ప స్థాయికి చేరి ఉండేదన్నారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చా పరంపరలో భాగంగా బుధవారం ‘పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, పారిశుధ్యం’పై వెబినార్‌లో ఆయన మాట్లాడారు. దేశం శరవేగంగా పట్టణీకరణ చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తుపై దృష్టిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పారు. ‘‘రాబోయే పాతికేళ్లలో దేశ ప్రగతి పట్టణ ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ‘‘మన నగరాలు వ్యర్థ, నీటి ఎద్దడి రహితంగా, అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉండటం చాలా ముఖ్యం. చక్కని ప్రణాళిక అందుకు కీలకం. కొత్త నగరాల అభివృద్ధి, ఉన్నవాటి ఆధునికీకరణ కూడా పట్టణాభివృద్ధిలో కీలకమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల్లో పట్టణ ప్రణాళిక వ్యవస్థ బలోపేతం, ప్రైవేట్ రంగంలో నైపుణ్యాన్ని అందుకు సమర్థంగా వినియోగించుకోవడం, పట్టణ ప్రణాళికను అత్యున్నతంగా తీర్చిదిద్దే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణానికి ఏం చేయాలో దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రణాళిక సరిగా లేకున్నా, దాని అమలులో విఫలమైనా పెను సమస్యలకు దారి తీయడం ఖాయం’’ అని సూచించారు. పట్టణాభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. టైర్–2, టైర్–3 నగరాల ప్రణాళిక, అభివృద్ధిలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరముందన్నారు. -
అక్రమంగా సెల్లార్ కట్టు...
* నేలమాళిగలో యథేచ్ఛగా అక్రమాలు * ఖాళీ స్థలాలలో సాగుతున్న వ్యాపారాలు * భవనాల నిర్మాణంలో షరతుల ఉల్లంఘన * పట్టించుకోని పట్టణ ప్రణాళిక అధికారులు * వాహనాల నిలుపుదలకు అనేక ఇబ్బందులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘‘సెల్లార్లు వాహనాలు నిలపటానికి కేటాయించిన నిర్మాణాలు. అక్కడ ఎలాంటి వ్యాపారాలకు అనుమతి ఇవ్వొద్దు. అలాంటివి ఎక్కడైనా ఉంటే వాటిని గుర్తించి తొల గించండి. వాహనాల నిలుపుదలకు అనువుగా తీర్చిదిద్దండి. అప్పుడే రహదారులపై సమస్యలు తగ్గి రాకపోకలు సులభమవుతాయి’’ పట్టణ ప్రణాళిక విభాగం ఉత్తర్వులు ఇవి. నగరంలో మాత్రం అమలు కావడం లేదు. సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టటం లేదు. బహుళ, వ్యాపార సముదాయాల యజమానులు అనుమతులను యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. సెల్లార్లు, స్టిల్ట్ (భూమిపై ఖాళీ స్థలాలు)ను వ్యాపారులకు అనువుగా మార్చుతున్నారు. దీంతో నగరంలో వాహనాల నిలుపుదల పెద్ద సమస్యగా మారింది. భారీ కట్టడాలను పార్కింగ్ స్థలాలు లేకుండా నిర్మిస్తుండటం తో నగరవాసులకు, పనుల మీద జిల్లా కేంద్రానికి వచ్చేవా రికీ ఇబ్బందులు తప్పటం లేదు. 200 చదరపు మీటర్ల పరిధిలోపు కట్టడమైతే స్టిల్ట్, 750 చదరపు మీటర్ల పరిధి దాటితే నేలమాళిగ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. ప్రధానంగా బహళ అంతస్థులు, వ్యాపార సముదాయాలు, కల్యాణ మండపాలు, ప్రయివేటు విద్యాసంస్థలు, ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. నిర్మాణ సమయంలో వాహనాల నిలుపుదలకు స్థలాన్ని చూపించి, ఆ పై తెలివిగా వ్య వహరిస్తున్నారు. నిర్మాణం పూర్తి కాగానే ఆ ప్రదేశాన్ని వ్యాపార ప్రయోజనాలకు వినియోగిస్తూ ఆర్థికం గా లబ్ధి పొందుతున్నారు. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనే.. * నిజామాబాద్-హైదరాబాద్ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా నిర్మించే బహుళ అంతస్థుల భవనాలు, వాణిజ్య సముదాయాలలో వాస్తవంగా సెల్లార్‌ను వాహనాల పార్కింగ్ కోసం వినియోగించాలి. ఇవి లేని కారణంగా వాహనదారులకు చాలాచోట్ల పెయిడ్ పార్కింగ్లు శరణ్యంగా మారుతున్నాయి. లేదంటే దుకాణాల వద్దకు వచ్చే ప్రజలు వాహనాలు రహదారిపై నిలుపుతుండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఎదురవుతోంది. * రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు తరచూ ట్రాఫి క్ జామ్ అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ రోడ్డుకిరువైపులా ఉన్న షాపింగ్కాంప్లెక్స్ల ఎదుట పలు దందా లు జరుగుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. * ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రమేష్ థియేటర్‌కు ఎదురుగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్లో వ్యాపారాలు జరుగుతున్నాయి. ఆ కాంప్లెక్స్‌కు పార్కింగ్ స్థలం లేకపోవడం, వాహనాలను బయటే నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. * శ్రీదేవి థియేటర్ ఎదురుగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌కు సెల్లార్ లేదు. ఏకంగా కొంత డ్రైనేజీ భాగాన్ని ఆక్రమించి నిర్మించిన ఈ భవనానికి కనీసం సెట్‌బ్యాక్ కూడా వదలకుండా నిర్మించడంపై ఆరోపణలు వస్తున్నాయి. * వినాయకనగర్‌లోని గణపతి బావి ఎదురుగా నిర్మించిన ఓ షాపింగ్ కాంప్లెక్స్లోను సెల్లార్‌ను వాణిజ్య సముదాయంగా మార్చారు. వారికి కాసులు... జనానికి జరిమానాలు * హైదరాబాద్ నుంచి అనుమతి వచ్చిందా? లేదా ? నిబంధనల ప్రకారం భవనం నిర్మిస్తున్నారా? లేదా? అని చూడాల్సింది పట్టణ ప్రణాళిక విభాగం అధికారులే. కానీ మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారు. భవన యజమానులు వాటిని అద్దెకిస్తూ డబ్బు దండుకుంటున్నారు. * ఈ మొత్తంలో ఇబ్బంది పడుతున్నది మాత్రం జనమే! రద్దీగా ఉండే ప్రాంతాలలో వాహనాన్ని కాసింత రహదారిపై పెడితే ‘జరిమానా’ అంటూ ట్రాఫిక్ పోలీసులు కాచుకు కూర్చుంటున్నారు. సెల్లార్లో నిలిపే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని సెల్లార్లకు పురపాలక అధికారులు ఆస్తి పన్ను కూడా దండుకుంటుండడం గమనార్హం. కొన్నిచోట్ల నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి * 750-1000 చ.మీ. విస్తీర్ణంలో భవనం, సెల్లార్ నిర్మాణానికి హైదరాబాద్‌లోని పట్టణ ప్రణాళిక విభాగం ప్రాంతీయ సంచాలకుడు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. * వెయ్యి చ.మీ. విస్తీర్ణం కంటే అధికంగా ఉంటే భవ నం, సెల్లార్ నిర్మాణానికి హైదరాబాద్‌లోని డెరైక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి అనుమతి పొందాలి. * ప్రతిపాదిత సెల్లార్ నిర్మించే భవనానికి ఓ వైపు తప్పనిసరిగా 30 అడుగుల రహదారి ఉండాలి * సెల్లార్‌ను పార్కింగ్ కోసమే వినియోగించాలి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు.


