under-21 hockey tournment
-
భారత అండర్–21 హాకీ జట్టు హెడ్ కోచ్‌గా సోయెజ్
న్యూఢిల్లీ: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, టీమిండియా మాజీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ స్థానంలో... భారత అండర్–21 పురుషుల హాకీ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా ఫ్రెడరిక్ సోయెజ్ను నియమించారు. ఫ్రాన్స్‌కు చెందిన సోయెజ్కు అంతర్జాతీయ ప్లేయర్‌గా 15 ఏళ్లు... హెడ్ కోచ్‌గా 15 ఏళ్లు అనుభవం ఉందని హాకీ ఇండియా తెలిపింది. ఫ్రాన్స్ తరఫున సోయెజ్ 196 మ్యాచ్‌లు ఆడి 195 గోల్స్ చేశాడు. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్పెయిన్ జట్టుకు... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఫ్రాన్స్ జట్టుకు సోయెజ్ కోచ్‌గా వ్యవహరించారు. -
ఫైనల్లో భారత్
జొహార్ బహ్రూ (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహర్ కప్ అండర్-21 హాకీ టోర్నీలో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతున్న ఆటగాళ్లు గురువారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లోనూ ఇదే జోరును చూపారు. తమన్ దయా హాకీ స్టేడియంలో దక్షిణ కొరియాతో జరిగిన ఈ మ్యాచ్‌ను భారత్ 6-1 తేడాతో గెలుచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోని భారత్‌కు ఇది నాలుగో విజయం. దీంతో మొత్తం 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత జట్టు ఆతిథ్య మలేసియాను ఢీకొంటుంది. మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషంలోనే అమిత్ రోహిదాస్ గోల్ చేయగా 9వ నిమిషంలో సత్బార్ సింగ్, 31వ నిమిషంలో తల్వీందర్ సింగ్ చేసిన గోల్స్‌తో ప్రథమార్థంలోనే భారత్ 3-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత మ్యాచ్ చివర్లో కుర్రాళ్లు రె చ్చిపోయారు. అమోన్ మిరాష్ టికే (57వ నిమిషం), రామదీప్ సింగ్ (62), అఫాన్ యూసుఫ్ (65) గోల్స్ కొట్టడంతో భారత్ విజ యం ఖరారైంది. కొరియా నుంచి యు స్యూంగ్ జు 34వ నిమిషంలో గోల్ సాధించాడు. శనివారం జరిగే తమ చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు మలేసియాను ఢీకొంటుంది. -
భారత్ హ్యాట్రిక్
జోహర్ బారు (మలేసియా): సుల్తాన్ జోహర్ కప్ అండర్-21 హాకీ టోర్నమెంట్లో భారత్ వరుసగా మూడో విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 4-0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సుఖ్మోన్జింగ్ సింగ్ రెండు గోల్స్ చేయగా... ఇమ్రాన్ ఖాన్, రమణ్‌దీప్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. ఈ విజయంతో భారత్ తొమ్మిది పాయింట్లతో మలేసియాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది.


