prolong
-
‘బెయిల్ మీ ఇష్టమా?’.. కింది బెంచ్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలో సంచలనం రేకెత్తించేలా భారత అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఒక కీలక తీర్పును వెలువరించింది. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) అంటే ‘ఉపా’ (UAPA) చట్టం కింద నమోదైన కేసుల్లోనూ ‘బెయిల్ పొందడం ఒక నియమం’ అని, విచారణ లేకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ముఖ్యంగా ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్ కు బెయిల్ నిరాకరించిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీంతో ఉమర్ ఖాలిద్‌కు బెయిల్ దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి. గతంలో ‘కేఏ నజీబ్’ కేసులో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును కింది బెంచ్‌లు పట్టించుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పులను న్యాయవ్యవస్థలో కీలక మార్గదర్శకాలుగా భావిస్తారు. అలాంటి తీర్పులు చట్టపరమైన స్పష్టతను తీసుకురావడమే కాదు, దిగువ బెంచ్‌లకు దిశానిర్దేశం చేస్తాయి. ఇద్దరు జడ్జిల బెంచ్ ఏదైనా అంశాన్ని విచారించే సమయంలో పెద్ద బెంచ్ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవడం న్యాయసూత్రాల్లో భాగం. పెద్ద ధర్మాసనం అభిప్రాయాన్ని పక్కన పెట్టి భిన్నంగా వ్యవహరించొద్దు. చిన్న బెంచ్‌లు పెద్ద ధర్మాసనం నిర్దేశించిన సూత్రాలను అనుసరించడం న్యాయపరమైన బాధ్యతగా భావిస్తారు. ఈ విషయాన్నే సుప్రీంకోర్టు కాస్త ఘాటుగా చెప్పింది.విస్తృత ధర్మాసనం తీర్పులను ధిక్కరిస్తారా?జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 2024లో వెలువడిన ‘గుర్విందర్ సింగ్’, ఉమర్ ఖాలిద్ కు సంబంధించిన ‘గుల్ఫిషా ఫాతిమా’ కేసుల్లో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పులపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2021లో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘కేఏ నజీబ్’ కేసులో ఇచ్చిన తీర్పుకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పులకు కట్టుబడి ఉండాల్సిందేనని, చిన్న బెంచ్‌లు వాటిని తక్కువ చేయడం న్యాయ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు ఘాటుగా మందలించింది.‘ఉపా’ కేసుల్లోనూ బెయిల్ ప్రాథమిక హక్కేఉపా చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, ‘బెయిల్ ఇవ్వడమే నియమం.. జైలులో ఉంచడం మినహాయింపు’ అనే సూత్రం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 21 కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును ఉపా చట్టంలోని కఠినమైన సెక్షన్ 43D(5) కూడా అడ్డుకోలేదని పేర్కొంది. కేవలం ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే సాకుతో, నిందితులను ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైలులో ఉంచడం అనేది వారికి శిక్ష విధించినట్లే అవుతుందని కోర్టు హెచ్చరించింది. ఆరోపణలు ఎంత తీవ్రమైనవో, విచారణ కూడా అంతే వేగంగా జరగాలని సూచించింది.ఆరేళ్ల జైలు జీవితం: సయ్యద్ ఇఫ్తిఖర్ కు విముక్తిమాదకద్రవ్యాల సరఫరా ద్వారా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణలపై ఉపా చట్టం కింద అరెస్టై, ఆరేళ్లుగా జైలులో ఉన్న జమ్ముకశ్మీర్‌కు చెందిన సయ్యద్ ఇఫ్తిఖర్ అంద్రాబీ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. కింది కోర్టులు, హైకోర్టు ఇతనికి బెయిల్ నిరాకరించగా, సుప్రీంకోర్టు మాత్రం అతని సుదీర్ఘ జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. ఉపా కేసుల్లో నేరం రుజువయ్యే శాతం చాలా తక్కువగా ఉందని కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తుచేయడం గమనార్హం.ఇది కూడా చదవండి: మణిపూర్‌లో టెన్షన్.. బందీల కోసం బలగాలు -
పుష్కర ఘటనపై సా..గుతున్న విచారణ
రాజమహేంద్రవరం క్రైం : పుష్కర తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు కమిష¯ŒS విచారణ కొనసాగుతూనే ఉంది. విచారణ ఈ నెల 28 కి వాయిదా వేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథిగృహంలో పుష్కర తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సోమయాజులు కమిష¯ŒS విచారణ నిర్వహించింది. పుష్కరాల సమయంలో తీసిన ఫొటోలు, సీడీలు, కొన్ని డాక్యుమెంట్లను సమాచార శాఖ కమిషన్‌కు సమర్పించింది. వాటిని తమకు ఇవ్వాలని కమిష¯ŒSను పౌరహక్కుల సంఘం నాయకుడు, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అభ్యర్థించారు. అనంతరం ఈ నెల 28 కి విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ సోమయాజులు ప్రకటించారు. కమిష¯ŒS గడువు ఈ నెల 29 తో ముగియనుంది. అనంతరం న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ పుష్కర తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం కమిష¯ŒS వేస్తూ 6 నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని గడువు విధించి ఏడాదిన్నర కావస్తున్నా అధికారులు కమిష¯ŒSకు పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించలేదన్నారు. ఈ సంఘటన కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు ఇవ్వలేదని, నేషనల్ జియోగ్రఫీ చానల్లో కూడా పూర్తిస్థాయి ఆధారాలు సమర్పించకుండా ఎడిట్ చేసి ఇచ్చారన్నారు. సీఎం స్నానానికి అనుమతి ఇచ్చిందెవరు? వీఐపీ ఘాట్ ఉండగా పుష్కర ఘాట్ లో సీఎం చంద్రబాబు నాయుడు స్నానం చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారని ముప్పాళ్ల ప్రశ్నించారు. పుష్కర ఘాట్ లో బారికేడ్లు ఎవరి ఆదేశాల మేరకు తొలగించారో చెప్పాలన్నారు. సంఘటన సమయంలో పుష్కర ఘాట్‌లో ఆక్సిజ¯ŒS అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువ మంది మృత్యువాతపడ్డారని అన్నారు. ఈ సంఘటనలో 170 మంది బాధితులను విచారించామని చెబుతున్న పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించలేదని అన్నారు. కమిష¯ŒS గడువు ఈనెల 29 తో ముగుస్తున్నందున ఆ లోగా అన్ని శాఖలు పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించి బాధ్యులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది సీహెచ్ ప్రభాకరరావు, కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మ¯ŒS కూనపురెడ్డి శ్రీనివాస్, డీపీఆర్ఓ వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం రూరల్ తహసీల్దార్ కె.భీమారావు, డీఎస్పీ రామకృష్ణ, ఎ.వి.స్వరూప్, త్రీటౌ¯ŒS సీఐ శ్రీరామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ సమావేశాలను పొడిగించం
4వ తేదీ వరకే నిర్వహిస్తాం అవసరమైతే ఒకరోజు సాయంత్రం భేటీ బీఏసీ సమావేశంలో స్పష్టం చేసిన ప్రభుత్వం 15 రోజులు నిర్వహించాలని వైఎస్సార్సీపీ వినతి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలను పొడిగించేందుకు ప్రభుత్వం ససేమిరా అంది. సెప్టెంబర్ 4వ తేదీ వరకే సమావేశాలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అవసరమైతే ఒకరోజు సాయంత్రం పూట నిర్వహిస్తామని తెలిపింది. శాసనసభ వ్యవహారాల సలహా మండలి(బీఏసీ) సమావేశం సోమవారం స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ తరపున శాసనసభా పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ, సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బీజేఎల్పీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. శాసనసభ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని వైఎస్సార్సీపీ కోరింది. 24 అంశాలను సభలో చర్చించాలని ప్రతిపాదించింది. దీన్నిప్రభుత్వం అంగీకరించలేదు. బిల్లులను ఆమోదించుకొనేందుకు సభను ఒకరోజు సాయంత్రం పూట సమావేశపరుస్తారు. బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కాకపోవటాన్ని చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు ప్రస్తావించారు. జ్యోతుల, గడికోట స్పందిస్తూ.. మేం సరిపోమా అన్నారు. ఇదే సమయంలో మంత్రి యనమల జోక్యం చేసుకుని కాలువ తీరుపట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రతి ఒక్కరూ సమావేశానికి హాజరయ్యేలా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మీదే అని అన్నట్లు సమాచారం. కరువుపై మండలిలో నేడు చర్చ రాష్ర్టంలో నెలకొన్న కరువు పరిస్థితులపై మంగళవారం శాసనమండలిలో చర్చించనున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన మం డలి సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మండలి సలహా కమిటీ సమావేశం ఛైర్మన్ చక్రపాణి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య, వైఎస్సార్సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదాపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై మండలిలో చర్చకు ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. యనమల స్పందిస్తూ.. ఇదే అంశంపై శాసనసభలో ప్రభుత్వం ప్రకటన చేస్తోందని, అక్కడ చర్చించిన తరువాత మండలిలో చర్చిద్దామని చెప్పారు. చంద్రబాబు.. అంత టైమ్ లేదన్నారు ప్రజా సమస్యలపై చర్చించడానికి శాసనసభ సమావేశాలను పొడిగించాలని తాము కోరగా.. అంత టైమ్ లేదని సీఎం చంద్రబాబు అన్నారని వైఎస్సార్సీపీ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రు చెప్పారు. బీఏసీ అనంతరం ఆయన ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డిలతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. సభను 15 రోజులపాటు జరపాలని సీఎంని ప్రత్యేకంగా అభ్యర్థించానన్నారు.పాలనాపరమైన విధుల్లో తలమునకలై ఉన్నామని, అన్ని రోజులు సభ జరపడం సాధ్యం కాదంటూ తమ అభ్యర్థనను సీఎం తోసిపుచ్చారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రతిపాదించినవి విభజన చట్టంలోని హామీలు-ప్రత్యేక హోదా, గోదావరి పుష్కరాల్లో భక్తుల మరణాలు, ఓటుకు కోట్లు కేసు, రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణ, బినామీ కంపెనీలకు సంతర్పణలు, రైతుల ఆత్మహత్యలు, ఇసుక మాఫియా, రిషితేశ్వరి మృతి, కళాశాలల్లో ఆత్మహత్యలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, పోలవరం-పట్టిసీమ, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, నీరు-చెట్టు, ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, విషజ్వరాలు-మరణాలు, బొగ్గు కుంభకోణం, జీవో నంబర్ 22, రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, బెరైటీస్ టెండర్ల మార్పు, గృహ నిర్మాణం, టీడీపీ వాగ్దానాలు. టీడీపీ ప్రతిపాదించినవి ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, గోదావరి మహా పుష్కరాలు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, ఎర్రచందనం అక్రమ రవాణా, విశ్వవిద్యాలయాల పరిపాలన, రైతుల రుణ మాఫీ, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, బీసీ సబ్‌ప్లాన్, జాతీయ విద్యా సంస్థలు, మీ ఇంటికి మీ భూమి. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు , ఫించన్లు, సంక్షేమ కార్యక్రమాలు. బీజేపీ ప్రతిపాదించిన అంశాలు పెరిగిన ఇసుక ధరలు, రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా.


