సియోని : చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. చనిపోయే వ్యక్తికి కూడా తాను ఇప్పుడు చనిపోబోతున్నాను అనే విషయం తెలియదు. చనిపోవడం అనేది ఇప్పటికీ ఓ మిస్టరీయే. అది ఎప్పుడు ఎవరికి ఎలా ఏ రూపంలో వస్తుందో ఊహించలేం. ప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. గణపతి నిమజ్జనం సందర్భంగా నాగిని డాన్స్ చేస్తూ ఓ వ్యక్తి అకాస్మాత్తుగా మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన గురుచరణ్ ఠాగూర్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి గణేష్ మండపం వద్ద నాగిని మ్యూజిక్‌కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఏమైందా అని చుట్టూ ఉన్న వాళ్లు దగ్గరికి వెళ్లి చూసేలోపే అతడు మృతిచెందాడు. అతడు డ్యాన్స్ చేస్తూ మృతి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నాగిని డాన్స్ చేస్తూ చనిపోయాడు
Sep 14 2019 6:29 PM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement