బుమ్రాలా ప్రయత్నించి.. | Watch,Boy Imitates Jasprit Bumrah's Bowling Action | Sakshi
Sakshi News home page

బుమ్రాలా ప్రయత్నించి..

Jan 9 2019 7:37 PM | Updated on Mar 20 2024 3:59 PM

జస్ప్రిత్‌ బూమ్రా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన తొలి ఏడాదే ప్రపంచ అత్యుత్తమ బౌలర్‌గా పేరు గడించాడు. తన దైన రీతిలో స్టన్నింగ్‌ యార్కర్స్‌తో, విభిన్న శైలితో అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు బుమ్రా. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 21 వికెట్లతో చెలరేగిన జస్‌ప్రీత్ బుమ్రా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో ఆసీస్‌లోనూ బుమ్రాకు తెగ క్రేజ్‌ ఏర్పడింది. బుమ్రాలో బౌలింగ్‌ చేయాలని అనుకరించే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. (బూమ్రా స్థానంలో సిరాజ్‌)తాజాగా ఓ ఆసీస్‌ బుడ్డోడు అచ్చం బుమ్రాలా బౌలింగ్‌ వేసేందుకు ప్రయత్నిస్తున్న వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. బుడ్డోడు బౌలింగ్‌ చేస్తున్న వీడియోను క్వీన్‌లాండ్స్‌కు చెందిన మైకెల్‌ కర్టిన్‌ ట్వీట్‌ చేశాడు. ‘బుమ్రా.. మీరు సాధించిన టెస్టు సిరీస్‌ విజయంతో వచ్చిన సమస్య ఏంటంటే.. భవిష్యత్‌ తరం ఆసీస్‌ క్రికెటర్లకు స్పూర్తి కలిగించేంత’అంటూ కామెంట్‌ జత చేశాడు. పిల్లాడు చాలా క్యూట్‌గా ఉన్నాడు, నా అభినందనలు తెలప’మంటూ బుమ్రా స్పందించడం విశేషం. ఇక ప్రపంచకప్‌ దృష్ట్యా బుమ్రాకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావిస్తున్న నేపథ్యంలో ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement