ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ అజేయ సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సెంచరీ అనంతరం ఓ ప్రత్యేకమైన స్టైల్‌తో కేఎల్ రాహుల్ కెప్టెన్ విరాట్‌తో కలిసి మైదానంలో సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టైల్ నెటిజన్లను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే మ్యాచ్ అనంతరం భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్, కేఎల్ రాహుల్‌ను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. రెండేళ్ల తర్వాత సాధించిన ఈ సెంచరీ తనకెంతో ప్రత్యేకమైనదని ఈ సందర్భంగా రాహుల్ చెప్పుకొచ్చాడు.