సౌదీ అరేబియా ఫుట్‌బాల్ జట్టు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా సౌదీ ఫుట్‌బాల్ ప్లేయర్లు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఉరుగ్వేతో మ్యాచ్ ఆడేందుకు రాస్తోవ్‌కు వెళ్తున్న సమయంలో విమానంలోని ఓ ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. విమానం గాల్లో ఉండగానే మంటలు వ్యాపించడంతో ఆటగాళ్లంతా ఆందోళనకు గురయ్యారు.