ప్రపంచ క్రికెట్‌లో పలు రకాలైన అవుట్‌లతో బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాటపడుతూ ఉంటారు. అందులో అబ్‌స్ట్రక్టింగ్ అవుట్ ఒకటి. బ్యాట్స్‌మన్ ఉద్దేశపూర్వకంగా బంతికి అడ్డుతగిలితే దానిని అబ్‌స్ట్రక్టింగ్ అవుట్‌గా పరిగణిస్తారు. ఈ అవుట్ ద్వారా ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తాజాగా బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్ తరపున ఆడుతున్న అలెక్స్ రాస్ ఇలానే పెవిలియన్‌కు చేరడం వివాదానికి దారి తీసింది. మరొకవైపు బీబీఎల్ చరిత్రలో ఒక బ్యాట్స్‌మన్ అబ్‌స్ట్రక్టింగ్ అవుట్ ద్వారా పెవిలియన్‌కు చేరడం కూడా ఇదే తొలిసారి.