ప్రత్యేక హోదా కోసం రాష్ట్రమంతటా ఆందోళనలు, ఆగ్రహావేశాలు పెల్లుబిగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆనంద నగరాలు పేరుతో వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఇలాంటి పనికిమాలిన కార్యక్రమానికి తెలుగువారైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకావడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వ పథకాలపై 71 శాతం మంది సంతృప్తిగా ఉన్నారన్న సీఎం వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఎన్నికలకు వెళదామని సవాలు విసిరారు.