రైల్వే ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్ని ప్రకటనలు చేస్తున్నా... కొందరు ప్రయాణికులు మాత్రం అవేం పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కిందపడిన తన బ్యాగ్ కోసం కదులుతున్న రైల్లోంచి దూకిన ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అయితే క్షణం ఆలస్యం చేయకుండా అక్కడున్న కొందరు అప్రమత్తం కావటంతో ప్రాణాలతో బయటపడింది.