శ్రీగౌతమిది హత్యే..? | West Godavari - Sri Gouthami Murder Case Mystery Reveals | Sakshi
Sakshi News home page

శ్రీగౌతమిది హత్యే..?

Jun 26 2018 10:41 AM | Updated on Mar 21 2024 5:19 PM

శ్రీ గౌతమి కేసులో టీడీపీ ముఖ్యనేత సజ్జా బుజ్జితో పాటు మరికొందరు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారిని పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెడతారని తెలుస్తోంది. అప్పట్లో శ్రీగౌతమిది హత్యేనంటూ ఆమె సోదరి పావని, తల్లి అనంతలక్ష్మి ఎందరో నేతలకు తమ గోడు చెప్పుకున్నారు. పోలీసుల కాళ్లావేళ్లా పడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బుజ్జి టీడీపీ నేత కావడం, పైగా ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎవరూ శ్రీగౌతమి కుటుంబం వైపు కన్నెత్తి చూడలేదు. అప్పటి దర్యాప్తు అధికారులు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కేసును నీరు కార్చేశారని సమాచారం. వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు,  ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా ఫలితం లేకపోయింది. జరిగిన ఘోరం నుంచి తీవ్ర గాయాలతో బయటపడ్డ శ్రీగౌతమి సోదరి పావని మాత్రం ధైర్యంగా అక్కకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటానికి సిద్ధపడింది. కేసును నిస్పక్షపాతంగా విచారించి న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా సీబీసీఐడీని ఆశ్రయించింది. సీఐడీ జోక్యం చేసుకుని కేసు విచారణ ప్రాథమికంగా చేయడం, కాల్‌ లిస్ట్‌ ఆధారంగా దర్యాప్తు చేయడంతో ఇది హత్యేనని నిరూపణ అయ్యింది. తరువాత మళ్లీ పోలీసులు కేసును తిరిగి విచారణకు చేపట్టడం జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement