కేంద్ర బడ్జెట్ తమకు నిరాశ కలిగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ నిరుపయోగమని ఆయన పెదవి విరిచారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన శనివారం పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ సీపీ ఎంపీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.