పుల్వామ ఉగ్రదాడిలో అశువులు బాసిన 40మంది జవాన్లకు తెలంగాణ అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పించింది. అంతేకాకుండా అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఉగ్రదాడిలో మరణించిన ఒక్కొక్క అమర జవాను కుటుంబానికి రూ.25 లక్షలు అందచేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. శుక్రవారం ఉదయం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ పుల్వామా అమర జవాన్లకు సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.
ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షలు
Feb 22 2019 12:10 PM | Updated on Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement