స్కూల్‌ బస్‌ బోల్తా, విద్యార్థులకు గాయాలు | School bus falls off culvert In Nellore district | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్‌ బోల్తా, విద్యార్థులకు గాయాలు

Aug 30 2019 12:50 PM | Updated on Mar 20 2024 5:24 PM

సాక్షి, నెల్లూరు : శ్రీ చైతన్య స్కూల్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. డక్కిలి మండలం కమ్మపల్లి రోడ్డు సమీపంలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. విద్యార్థులను స్కూల్‌కు తీసుకువెళుతున్న సమయంలో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి కల్వర్టును ఢీకొని వంతెనపై నుంచి బోల్తాపడింది. సుమారు పదిమంది విద్యార్థులు తీవ‍్రంగా గాయపడ్డారు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. 

రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై మృతి
కాగా ఆత్మకూరు మండలం వాసిలి సమీపంలో కారు...పందిని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌ ఏఎస్సై రాజు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement