చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ | Non Bailable Arrest Warrant Against Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Sep 14 2018 11:38 AM | Updated on Mar 20 2024 3:34 PM

మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సాగునీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావులకు అరెస్టు వారెంట్‌ జారీచేసింది. 2010లో అనుమతి లేకుండా బాబ్లీ ప్రాజెక్టును సందర్శించిన కేసులో చంద్రబాబు సహా మరో 15 మంది తెలుగుదేశం పార్టీ నేతలకు శుక్రవారం అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. వీరిలో తెలంగాణ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు కూడా ఉన్నారు. కాగా, కోర్టు ఉత్తర్వులపై కౌంటర్‌ దాఖలు చేయాలని టీడీపీ నాయకులు భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement