అంతా క్షణాల్లో జరిగిపోయింది

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఆదివారం సాయంత్రం జరిగిన దిగ్భ్రాంతికర ఘటన స్థానికంగా కలకలం రేపింది. రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ఊహించనివిధంగా ప్రాణాలు కోల్పోయింది. ఖార్గార్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మృతురాలు సుజాత పూరి(34)గా గుర్తించారు. నెరుల్‌లో ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఆమె స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా నియంత్రణ కోల్పోయి బండి ఒక్కసారిగా పక్కకు జారిపోవడంతో ఆమె రోడ్డుపై పడిపోయారు. సుజాత వెనుకే వచ్చిన క్రేన్‌తో కూడిన వాహనం ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కికడ్కడే ప్రాణాలు వదిలారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top