కాపులను బీసీల్లో చేర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ నివేదికపై ఏపీ బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇచ్చే నివేదికే కమిటీ నివేదిక అని, ఏపీలో అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉంటుందని అన్నారు. శనివారం మంజునాథ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ...కమిషన్ నివేదికను ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.