తాడేపల్లిలో టీడీపీ నేతల బరితెగింపు

మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో టీడీపీ కార్యకర్తలకు బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైసీపీకి అధిక శాతం ఓట్లు నమోదు కావడాన్ని తట్టుకోలేక ఆ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. మహిళలని చూడకుండా వారిపై కూడా దాడి చేశారు. జనాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. టీడీపీ నేతల పక్షాన చేరి ఈ దాడులకు సహకరించటం గమనార్హం. ఈ దాడులపై వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా తాడేపల్లి స్టేషన్‌ ముందు నిరసనకు దిగారు. అంతేకాక పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఓ వైసీపీ కార్యకర్త పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top