పశ్చిమ గోదావరి జిల్లాలో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. తాను ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నాని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఈ విషయం పోలీసులకు చేరడంతో విచారణ చేపట్టారు. సెల్ఫీ వీడియో విడుదల చేసిన వ్యక్తి ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామానికి చెందిన గొరిల్లా శివరావుగా గుర్తించారు.