తాజాగా టీఆర్‌ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో రాహుల్ నివాసంలో ఆయనతో సమావేశమైన కొండా.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కుంతియాతో కలిసి కొండా రాహుల్ వద్దకు వెళ్లారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల టికెట్ ఇస్తానని తనకు హామీ ఇవ్వాలని, రాజకీయంగా తన వర్గానికి అవకాశాలు ఇవ్వాలని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాహుల్‌ను కోరుతున్నట్టు తెలుస్తోంది.