యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ పర్యటన సందర్భంగా పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మేడ్చల్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. టీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో పాటు, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్‌రెడ్డి జనగాం మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ నాయకత్వాన్ని విమర్శిస్తూ పార్టీకి రాజీనామా చేసిన కొండా గురువారమే ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో జనగాం నుంచి బీజేపీ తరుఫున పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఓటమి చెందిన విషయం తెలిసిందే.
సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లోకి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
Nov 23 2018 9:04 PM | Updated on Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement