ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను అడిగారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలతో జరిగిన భేటీ గురించి బుధవారం ఆయన ఇతర నాయకులతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు.