దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ బచావో ర్యాలీ సందర్భంగా శనివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో సోనియా మాట్లాడారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, దేశాన్నికాపాడుకునేందుకు కలిసి పోరాటం చేయాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మోదీ సర్కారు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని.. యువతకు ఉద్యోగాలు లేవని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోయిందని విమర్శించారు. ‘సబ్ సాత్, సబ్ కా వికాస్’ హామీ ఏమైందని సోనియా గాంధీ ప్రశ్నించారు.