తెలుగుదేశం నేతలు మరోసారి డ్రామాలకు తెరతీశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు 2010లో చేసిన దొంగపోరాటంపై కేసుపెట్టింది కాంగ్రెస్ పార్టీనే తప్ప బీజేపీ కాదన్నారు. గతంలో 22 నోటీసులు ఇచ్చినా చంద్రబాబు స్పందించకపోవడంతోనే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారన్నారు. అది ఒక న్యాయ ప్రక్రియ మాతమే తప్ప అందులో రాజకీయాలు లేవన్నారు. నోటీసులు చూసి చంద్రబాబు భయపడే రకం కాదని తెలిపారు. ఇవన్నీ చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే అని ఎద్దేవా చేశారు.