నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్‌ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. విపక్షాల ఫిర్యాదుతో కలెక్టర్‌పై ఈసీ వేటు వేసింది. ఈవీఎంలను నిబంధనలకు విరుద్దంగా తెరిచారంటూ కలెక్టర్‌పై గతంలోనే ఫిర్యాదులు రాగా.. ఆయన్ని సస్పెండ్ చేయాలని ఈసీ శనివారం ఆదేశాలు జారీ చేసింది.