ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. బుధవారం పట్టణంలోని గాయత్రి గార్డెన్‌లో నిర్వహించిన ఆదిలాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కాలర్లు పట్టుకున్నారు. సమావేశంలో మొదట కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి వర్గీయుడైన నదీమ్‌ఖాన్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ సాజిద్‌ఖాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడడంతో వేదిక ముందు కూర్చున్న సాజిద్‌ఖాన్ వర్గీయులు కొంతమంది ఆయనపై దాడికి దిగారు. కాలర్లు పట్టుకొని బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వేదికపై ఉన్న మాజీ మంత్రి సీఆర్‌ఆర్, గండ్రత్ సుజాత, సాజిద్‌ఖాన్ నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఏ సమావేశంలోనైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగడం శరమామూలేనని పలువురు చర్చించుకున్నారు.
వేదికపైనే తన్నుకున్న రెండు వర్గాలు
Jan 3 2019 9:49 AM | Updated on Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement