సాదాసీదా సొరెన్‌.. సైకిల్‌పై కాబోయే సీఎం! | Congress And JMM Lead In Jharkhand Assembly Election Results | Sakshi
Sakshi News home page

సాదాసీదా సొరెన్‌.. సైకిల్‌పై కాబోయే సీఎం!

Dec 23 2019 4:34 PM | Updated on Mar 22 2024 10:49 AM

దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు చివరిదశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన సమాచారం మేరకు కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఆ కూటమి 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. అధికార బీజేపీ 21 స్థానాల్లో ముందంజలో ఉంది. మిగతా స్థానాల్లో ఇతరులు విజయం దిశగా వెళ్తున్నారు. మొత్తం మీద అధికార బీజేపీ వ్యతిరేకంగా ఫలితాలు వెలువుడుతున్నాయి. కాంగ్రెస్‌- జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. దీంతో జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సొరేన్‌ జార్ఖండ్‌ కాబోయే సీఎం అంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement