కార్యకర్తపై కోపాన్ని ప్రదర్శించిన హరియాణా సీఎం | CM Manohar Lal Khattar pushes aside a man who tries to take a selfie with him | Sakshi
Sakshi News home page

కార్యకర్తపై కోపాన్ని ప్రదర్శించిన హరియాణా సీఎం

Jun 6 2019 2:16 PM | Updated on Mar 22 2024 10:40 AM

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మరోసారి బహిరంగంగా తన కోపాన్ని ప్రదర్శించారు. హరియాణా కర్నాల్‌లో ఆయన గురువారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలపై ఆయన పూలు చల్లుతుండగా.. ఓ కార్యకర్త ఆయన వద్దకు వచ్చి.. పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఫోన్‌ తీసి.. సీఎం ఎదురుగా పెట్టి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. కార్యకర్త సెల్ఫీయత్నం సీఎం ఖట్టర్‌కు తీవ్ర కోపం తెప్పించింది. అతని సెల్ఫీ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ.. సెల్‌ఫోన్‌ పట్టుకున్న చేతిని గట్టిగా తోసేసి.. అతనిపై కోపం ప్రదర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement