నేను కలలు గన్న తెలంగాణ కనిపిస్తోంది: సీఎం కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

నేను కలలు గన్న తెలంగాణ కనిపిస్తోంది: సీఎం కేసీఆర్‌

Published Mon, Dec 30 2019 7:06 PM

 కాంగ్రెస్‌, బీజేపీలకు తెలంగాణ భౌగోళిక, సాంకేతిక అంశాలపై కనీస పరిజ్ఞానం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని కేసులు పెట్టిన పట్టించుకోకుండా పనిచేశామని, దాని ఫలితం అందరూ చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాజెక్టులు, డ్యాంలను చూస్తుంటే తాను కలలు గన్న తెలంగాణ కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.