బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం ఎదురైంది. నవ్యాంధ్ర నూతన రాజధానిలో నిర్మించే రోడ్లు, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస సముదాయన్ని చూపించేందుకు ఎమ్మెల్యేలను మంత్రి నారాయణ తీసుకెళ్లారు. ఆ నేతల బృందంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. అయితే ఆయన భవన సముదాయాలను పరిశీలిస్తుండగా ఇతర నేతలతో కలిసి మంత్రి నారాయణ కూడా అక్కడ నుంచి వెళ్లిపోయారు. దాంతో విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వచ్చింది.