‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’ | Bhuj Seer Shocking Comments On Women And Menstruation | Sakshi
Sakshi News home page

‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’

Feb 18 2020 9:12 PM | Updated on Mar 22 2024 10:50 AM

నెలసరితో ఉన్న విద్యార్థినుల పట్ల అనాగరికంగా వ్యవహరించిన గుజరాత్‌లోని శ్రీ సహజానంద్‌ గర్ల్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఘటన వెనక ఓ స్వామిజీ నీచపు బుద్ధి ఉన్నట్టు తెలిసింది. పురాణాల కాలం నుంచి నెలసరితో ఉన్న మహిళలు కొన్ని కట్టుబాట్లను పాటిస్తున్నారని, అవి పాటించని పక్షంలో వాళ్లను ద్వేషించినా తప్పు లేదని స్వామి నారాయణ్‌ భుజ్‌ మందిర్‌ మత బోధకుడు కృష్ణస్వరూప్‌ దాస్‌జీ తన అనుయాయులకు చెప్పినట్టున్న వీడియోలు కొన్ని బయటపడ్డాయి. శ్రీ సహజానంద్‌ గర్ల్స్‌ ఇనిస్టిట్యూట్‌ను స్వామి నారాయణ్‌ టెంపుల్‌ ట్రస్ట్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement