‘టీడీపీ గూండాలను బాబు ఎగదోస్తున్నారు’
సీఎం చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఒక దిగజారిన ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు సీఎం కుట్రలు పన్నుతున్నారని, ఆర్టీవో అధికారులతో కలిసి సభకు వచ్చే బస్సు యజమానులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి