రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణ కమిటీ ముఖ్యమైన సూచనలు చేసింది. ఆ కమిటీ సూచనలను చంద్రబాబు పట్టించుకోలేదు. నారాయణ కమిటీ వేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేశారు.