మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. పొల్లాచ్చిలో తాజాగా షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట చిత్రబృందం. ఆ తర్వాత కొన్ని కీలక సన్నివేశాల కోసం అబుదాబీకి ‘మహర్షి’ టీమ్ వెళ్లనుంది. అంతటితో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ తొలిసారిగా గడ్డంతో నటిస్తున్నాడు. ఇప్పటికే మహేష్ న్యూలుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘మహర్షి’ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. పచ్చని పొలాల్లో మహేష్ మీడియాతో మాట్లాడుతున్నట్టుగా ఒక పిక్ ఉండగా, షూటింగ్ లొకేషన్స్‌కు సంబంధించిన మరో వీడియో ఉంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
వైరల్ అవుతున్న ‘మహర్షి’ వీడియో
Jan 29 2019 2:21 PM | Updated on Mar 20 2024 5:06 PM
Advertisement
Advertisement
Advertisement
